దేవదాసు కనకాల మృతి

దేవదాసు కనకాల మృతి

బుల్లి తెర యాంకర్ సుమ.. మామ, నటుడు రాజీవ్ కనకాల తండ్రి దేవదాసు కనకాల శుక్రవారం తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తన స్వగృహంలో మృతి చెందారు‌. నటుడిగా, దర్శకుడిగా తెలుగు ప్రజలకు సుపరిచితమైన దేవదాసు కనకాల కళామ తల్లికి సేవలు అందించారు. ఆయన చలిచీమలు, నాగవల్లి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాయి. దేవదాసు కనకాల మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story