ఇద్దరు పిల్లలున్నా.. తన కంటే 15 ఏళ్లు చిన్నవాడైన..

ఇద్దరు పిల్లలున్నా.. తన కంటే 15 ఏళ్లు చిన్నవాడైన..

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని పెద్దలు ఊరికే అన్లేదు. నాలుగు పదుల వయసు దాటాక.. తన కంటే 15 ఏళ్ల వయసు తక్కువ వయసున్న వ్యక్తితో ముద్దూ ముచ్చట్లు.. ఆనక పెళ్లి కూడాను. ఎవరి ఇష్టం వాళ్లది మనకెందుకు అని ఊరుకోకుండా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బాలీవుడ్ భామ సుస్మితా సేన్‌పై విరుచుకు పడుతున్నారు. లేటు వయసులో ఘాటు ప్రేమలేంటని అంటున్నారు. కొంత కాలంగా సుస్మిత.. బాయ్ ఫ్రెండ్ రోహ్‌మన్ షాల్ అనే మోడల్‌తో డేటింగ్ చేస్తోంది. ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా రోహ్‌మన్‌తోనే. అతడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది సుస్మిత. తాజాగా షేర్ చేసిన ఫోటో.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుంది. ఇక వీరి పెళ్లి నవంబర్ లేదా డిసెంబర్‌లో జరిగే అవకాశం ఉంటుంది. విషయం తెలిసి కొంత మంది అభిమానులు సుస్మితను విష్ చేస్తే.. మరికొంత మంది మాత్రం ఇదంతా అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లవక ముందే ఇద్దరు ఆడ పిల్లలను దత్తత తీసుకుని వారికి అమ్మ అయిన సుస్మితను ప్రశంసిస్తూ.. పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం హర్షించతగదని అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story