ఆంధ్రప్రదేశ్

బీజేపీలో చేరిన జనసేన, ఇతర పార్టీల నేతలు..

బీజేపీలో చేరిన జనసేన, ఇతర పార్టీల నేతలు..
X

బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఏపీకి చెందిన పలువురు నేతలు ఢిల్లీలో కాషాయకండువ కప్పుకున్నారు. మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి, కావలి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పసుపులేటి సుధాకర్, రిటైర్డ్ ఇన్‌కమ్ టాక్స్ కమిషనర్ కంచర్ల హరిప్రసాద్ సహా పలువురు నేతలు కమల తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్షీనారాయణ వీరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే సదుద్దేశంతో ఇతర పార్టీల నుంచి నాయకులు బీజేపీలో చేరుతున్నారని అన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు . ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా చేరికలను ప్రోత్సాహిస్తున్నట్టు చెప్పారు.

Next Story

RELATED STORIES