ఆ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సీఎం జగన్ కు ఫిర్యాదు చేస్తాం : వైసీపీ కార్యకర్తలు

X
నెల్లూరు జిల్లా గూడూరులో వైసీసీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పార్టీలో గుర్తింపు ఇవ్వడం లేదంటూ ఎమ్మెల్యే తీరునకు నిరసనగా ధర్నాకు చేశారు. 9 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి అధికారంలోకి తీసుకొస్తే... తమను పట్టించుకోకుండా ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కార్యకర్తలు ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రసాద్ కార్యకర్తలను పట్టించుకోకుండా... ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గ్రామ వాలంటరీ ఉద్యోగాల విషయంలో కార్యకర్తల సిఫార్సులను పట్టించుకోకుండా... పక్షపాతంలో తన వర్గానికి ఇప్పించుకుంటున్నారని వారు ఆరోపించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సీఎం జగన్ కు ఫిర్యాదు చేస్తామంటున్నారు కార్యకర్తలు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
