పది అర్హతతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు..

పది అర్హతతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు..

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) 413 ట్రేడ్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

విభాగాల వారీగా ఖాళీలు..

ట్రేడ్ అప్రెంటీస్: 353.. అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో ITI ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటీస్: 60.. అర్హత: సంబంధిత విభాగంలో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.. వయసు: 2019 జులై 31 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. OBC లకు మూడేళ్లు, SC,ST లకు ఐదేళ్లు, PWDలకు పదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ప్రారంభం: జులై 17, 2019.. దరఖాస్తు చివరి తేదీ: ఆగస్ట్ 7, 2019.. రాత పరీక్ష: ఆగస్ట్ 18, 2019.. పూర్తి వివరాల కోసం: http://iocl.onlinereg.in

Tags

Read MoreRead Less
Next Story