సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కేటీఆర్‌

సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కేటీఆర్‌

సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిని ఎమ్మెల్యే కేటీఆర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆస్పత్రిలో గైనకాలజిస్టులు లేరన్న ఫిర్యాదుల మేరకు ఆయన ఆస్పత్రికి వెళ్లారు. పరిస్థితి స్వయంగా పరిశీలించారు. వైద్యం కోసం వస్తున్న వారిని తిప్పి పంపుతున్న ఘటనలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంపై వైద్యశాఖ సెక్రెటరీతో గైనకాలజిస్ట్‌ల నియామకం గురించి మాట్లాడారు. వైద్యుల కొరతపై త్వరలోనే చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ కోరారు.

సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రిలో కొంతకాలంగా గైనకాలజిస్టుల కొరత తీవ్రంగా ఉంది. పురిటి నొప్పులతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆస్పత్రి సిబ్బంది.. కనీస వైద్యం చేయకపోగా.. డాక్టర్లు లేరు.. కరీంనగర్‌కు వెళ్లాలంటూ చెప్పేస్తున్నారు. పేరుకు వంద పడకల ఆస్పత్రి ఉన్నా డాక్టర్లు లేక సరైన వైద్యం అందడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story