జలకళ సంతరించుకున్న లక్నవరం సరస్సు

జలకళ సంతరించుకున్న లక్నవరం సరస్సు

ప్రకృతి అందాల సోయగం లక్నవరం సరస్సు జలకళ సంతరించుకుంది. ములుగు జిల్లాలోతోపాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు లక్నవరం సరస్సులోకి భారీగా వరదనీరు చేరుతోంది. కొన్ని రోజుల క్రితం జలసిరి లేక వెలవెలబోయిన సరస్సు.. ఇప్పుడు నిండుకుండలా మారింది. సరస్సులో కనుచూపమేర నిండుగా నీరు చేరడంతో సరస్సు మధ్యలోని సస్పెన్షన్‌ బ్రిడ్జిపై నుంచి సుందర ప్రకృతి మరింత అందంగా కనిపిస్తోంది.

ఎడతెరిపిలేని వర్షాలకు బొగ్గులవాగు ఉప్పొంగడంతో లక్నవరంలోకి విపరీతంగా నీరు ప్రవహిస్తోంది. 36 అడుగుల సామర్ధ్యం గల లక్నవరం సరస్సులో 30 అడుగుల నీరు చేరింది. జలసిరులతో లక్నవరం నిండటంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కాస్త తగ్గుముఖం పడితే... లక్నవరం అందాలు వీక్షించడానికి పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున తరలిరానున్నారు.

Tags

Read MoreRead Less
Next Story