ఒక మందుకు బదులు మరో మందు ఇచ్చిన ఫార్మాసిస్టు.. ఆరేళ్ల బాలుడికి..

కొండ నాలుకకు మందు వేస్తే.. ఉన్న నాలుక ఊడిందన్నట్లు తయారైంది ప్రభుత్వ దవాఖానాల పరిస్థితి. జ్వరం వచ్చిందని హాస్పిటల్‌కు పోతే.. ఫార్మాసిస్టు ఒక మందుకు బదులు మరో మందు ఇవ్వడంతో ఓ చిన్నారి ప్రాణాల మీదకు వచ్చింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రభుత్వ దవాఖానాలో జరిగింది ఈ ఘటన.
పట్టణంలోని జవహర్ నగర్‌కు చెందిన ఆరేళ్ల ప్రశాంత్‌కు జ్వరం రావడంతో.. ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ పరిశీలించి మందులు రాశారు. చీటీ తీసుకుని ఫార్మాసిస్టు దగ్గరకు పోతే.. రాసిన మందు కాకుండా మరోటి ఇచ్చారు. ఇది తెలియని తల్లిదండ్రులు ప్రశాంత్‌కు మందు తాగించారు. వెంటనే వాంతులు, విరేచనాలు కావడంతో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు మళ్లీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే సకాలంలో వైద్యం అందించడంతో... ప్రశాంత్‌కు ముప్పు తప్పింది. తప్పుడు మందులు ఇచ్చిన ఫార్మాసిస్టుపై వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com