భార్యను జూదంలో పెట్టాడు .. పందెం ఓడడంతో ఆమెపై సామూహిక అత్యాచారం

భార్యను జూదంలో పెట్టాడు .. పందెం ఓడడంతో ఆమెపై సామూహిక అత్యాచారం

సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఓ ప్రబుద్ధుడు మద్యానికి బానిసై భార్యనే జూదంలో పెట్టాడు. ఆ పందెంలో అతను ఓడిపోవడంతో జూదంలో పాల్గొన్నవారు ఆమెను అత్యాచారం చేశారు. అనంతరం బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా వారు ఆమెను పట్టించుకోలేదు. చివరకు ఆమె కోర్టును ఆశ్రయించింది. దీంతో భర్త, నిందితులపై పోలీసులు కేసు నమోదుచేశారు.

యూపీలోని జాన్‌పూర్‌ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఆ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తరుచూ జూదం ఆడేవాడు. అతని స్నేహితులైన అరుణ్, అనిల్‌‌తో కలిసి జూదంలో పాల్గొనేవాడు. అయితే ఆటలో డబ్బులు పోగొట్టుకొని చివరకు తన భార్యను పందెంలో పెట్టాడు. మళ్లీ ఓడిపోవడంతో అరుణ్, అనిల్‌ ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ అవమానం తట్టుకులేని భాధితురాలు తన మేనమామ ఇంటికి వెళ్లిపోయింది. తర్వాత భర్త ఆమె ఉన్న చోటుకు వెళ్ళి తప్పుచేశాను అంటూ క్షమాపణాలు కోరాడు. తిరిగి ఆమెను ఇంటికి తీసుకొస్తూ మరోసారి అనిల్‌, అరుణ్‌లను అత్యాచారం చేసేందుకు ఉసిగొల్పాడు. దీంతో బాధితురాలు స్ధానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా ఆమె ఫిర్యాదును వారు తీసుకోలేదు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి సామూహిక అత్యాచారం కింద కేసు నమోదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story