మెదక్‌ జిల్లాలో వింత.. ఆకాశంలో నుంచి ఊడిపడ్డ చేప..

మెదక్‌ జిల్లాలో వింత.. ఆకాశంలో నుంచి ఊడిపడ్డ చేప..

ఊళ్లోవాళ్లంతా రోజూవారి పనుల్లో బిజీగా ఉన్నారు. యాదగిరి కుటుంబ సభ్యులు కూడా ఎవరి పనుల్లో వాళ్లు ఉన్నారు. యాదగిరి కమార్తె బయట బట్టలు ఆరేస్తుండగా ఒక్కసారిగా ఆకాశం నుంచి ఏదో వస్తువు కిందపడి ఎగిరింది. షాక్‌ గురైన ఆ అమ్మాయి గట్టిగా కేకలు వేసింది. అరుపులు విన్న చుట్టుపక్కల జనాలు అక్కడికి చేరుకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఆకాశంలోంచి ఓ చేప పడింది.

ఈ ఘటన మెదక్‌ జిల్లా చేగుంట గ్రామానికి చెందిన మంగలి యాదగిరి ఇంట్లో జరిగింది. మొదట చేపను చూసి పాము అనుకుంది ఆ అమ్మాయి. ఆ తర్వాత పరీక్షించి ఆకాశంలోంచి పడింది చేపగా తేల్చారు. ఆ చేప బరువు మూడున్నర కిలోలు ఉంది. విషయం ఆ నోటా ఈ నోటా తెలిసే సరికి ఆకాశం నుంచి ఊడిపడ్డ చేపను చూడటానికి జనం తరలివస్తున్నారు. చేప ఇంకా ప్రాణాలతో ఉండటంతో నీటి తొట్టెలో వేశారు. ఇంతకీ ఆ చేప ఎలా పడిందో ప్రస్తుతానికి సస్పెన్స్‌ కొనసాగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story