వానరం చేసిన పని చూసి..

వానరం చేసిన పని చూసి..

సరదాగా వానరాలు చేసే చేష్టలు చూసి అంతా నవ్వుకుంటాం. దానికి ఏది కనిపించినా చాలు దాన్ని కలబెట్టి, విడగొట్టి వాసన చూసి ఆ వస్తువును పట్టుకుని పరుగులు పెట్టడమే దాని పని. ఇలా అవి చేసే చిలిపి పనులకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాలలో చాలా సార్లు చూసి ఉంటాం. తాజాగా ఓ కోతికి సంబంధించిన వీడియో టిక్ టాక్‌లో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆ వీడియో సందేశం చాలా మందికి ప్రేరణ కలిగించింది. అది మూగ జంతువైనా బాధ్యతాయుతంగా ప్రవర్తించిన తీరు ఆదర్శంగా నిలిచింది. దీన్ని ముందుగా భారత మాజీ ముఖ్య ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎస్.వై. ఖురైషి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. "ఇది మనుషులకు కనువిప్పు కలిగించే సందేశం" అంటూ ఓ క్యాప్షన్ కూడా జత చేశారు. ఆ వీడియోలో దాహంతో ఉన్న ఓ కోతి కుళాయి నుండి నీరు త్రాగి తర్వాత దాన్ని కట్టివేసి అక్కడ నుంచి పరుగులు పెడుతుంది.

Tags

Read MoreRead Less
Next Story