పోలవరం పనులు ఆగిపోయే పరిస్థితి రావడం దురదృష్టకరం - సుజనా చౌదరి

పోలవరం పనులు ఆగిపోయే పరిస్థితి రావడం దురదృష్టకరం - సుజనా చౌదరి
X

వ్యక్తిగత ద్వేషంతోనే జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తమకు అనుమానం కలుగుతుందని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అన్నారు. ప్రస్తుతం ఏపీలో ఏ పనులు కూడా ముందుకుసాగడం లేదని.. పోలవరం పనులు ఆగిపోయే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. ఒకసారి కంపెనీకి పనులు అప్పగించిన తర్వాత ప్రభుత్వాలు మారితే అవి కూడా మారాలనుకోవడం మంచిది కాదన్నారు. రాష్ట్రం చేతిలో ఉంటేనే పనులు వేగంగా జరుగుతాయని గతంలో కేంద్రం పోలవరం పనులు ఏపీకి అప్పగించినట్టు చెప్పారు. ఇటు ఏపీ అసెంబ్లీలో కూడా వ్యక్తిగత ధూషణలతోనే సమయం గడిచిపోయిందన్నారు సుజనా చౌదరి.

Tags

Next Story