నీలోఫర్‌ ఆసుపత్రి పరిస్థితి దయనీయంగా మారింది : కాంగ్రెస్‌ నేతలు

నీలోఫర్‌ ఆసుపత్రి పరిస్థితి దయనీయంగా మారింది : కాంగ్రెస్‌ నేతలు

హైదరాబాద్‌ నీలోఫర్‌ ఆసుపత్రిని కాంగ్రెస్‌ నేతలు సందర్శించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోపాటు ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆసుపత్రిలో రోగుల్ని కలిశారు. అక్కడ అందుతున్న సేవలపై ఆరాతీశారు. నీలోఫర్‌ హాస్పిటల్ పరిస్థితి చాలా దయనీయంగా మారిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఒక్కో బెడ్‌పై ఆరుగురు ఉన్నారని భట్టి చెప్పారు. 385 మంది ఉండాల్సిన నర్సులు 65 మందే ఉన్నారని, నిలోఫర్‌లో పిడియాట్రిక్‌ డాక్టర్ల కొరత ఉందన్నారు.

నిలోఫర్‌ హాస్పిటల్‌ను వెయ్యి పడకల ఆసుపత్రిగా మార్చినా వసతులు కల్పించలేదన్నారు ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి. వసతులు లేకపోవడంవల్లే జనాలు ప్రయివేటు ఆసుపత్రులకు తరలిపోతున్నారని జీవన్‌ రెడ్డి అన్నారు. నీలోఫర్‌ ఆసుపత్రిలో 53 మంది డాక్టర్ల కొరత ఉందన్నారు. నీలోఫర్‌ హాస్పటల్‌ ఆసుపత్రి పోలీసుల చేతుల్లో నడుస్తోందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story