యువతుల కిడ్నాప్‌కు యత్నించి ..

యువతుల కిడ్నాప్‌కు యత్నించి ..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు దగ్గర యువతుల కిడ్నాప్‌కు యంత్నించిన డ్రైవర్‌ కిషన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రెండు రోజుల కిందట ముంబై నుంచి వచ్చిన ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు పిలల్ని కిడ్నాప్‌ చేసేందుకు కిషన్‌ ప్రయత్నించి.. విఫలమవ్వడంతో పరారాయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కారు నెంబర్‌ ఆధారంగా నిందితుడు కిషన్‌ను శంషాబాద్‌ సమీపంలోని తిమ్మాపూర్‌ దగ్గర అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు..

రెండు రోజుల కిందట ముంబైకి చెందిన ఆరుగురు కుటుంబసభ్యులు శంషాబాద్ విమానాశ్రయంలో ఫ్లైట్ దిగారు. అక్కడి నుంచి సిటీకి చేరడానికి ఆన్‌లైన్‌లో రెండు క్యాబ్‌లు బుక్‌ చేసుకున్నారు. అక్కడే ఉన్న ఓ కారు డ్రైవర్.. తనది ఓలా క్యాబ్‌ అని చెప్పి నమ్మించాడు. నిజమేనని భావించి ముందుగా ఇద్దరు కూతుళ్లను ఆ కారులోకి ఎక్కారు. ఆ వెంటనే డ్రైవర్ ఓవర్ స్పీడుతో కారును నడిపి అక్కడి నుంచి జంప్ అయ్యాడు. కారులో ఉన్న యువతి భయపడి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. ఇంతలో బుక్‌ చేసిన కారు రావడంతో తల్లిదండ్రులు మరో కారులో ఛేజ్ చేశారు.

తల్లిదండ్రులు వచ్చి కారును అడ్డగించడంతో భయపడ్డ కిడ్నాపర్‌ యువతులను కిందకు దింపి వెంటనే అక్కడి నుంచి పారారయ్యాడు. ఆ క్యాబ్ నెంబర్ ఆధారంగా ఆర్జీఐఏ పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎట్టకేలకు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story