సిద్ధార్థ మృతి కేసులో వెలుగులోకి కొత్త విషయాలు.. కొందరు ఉద్యోగులు కలసి ఆ కుట్ర..

సిద్ధార్థ మృతి కేసులో వెలుగులోకి కొత్త విషయాలు.. కొందరు ఉద్యోగులు కలసి ఆ కుట్ర..

కేఫ్ కాఫీ డే గ్రూప్ ఛైర్మన్ వీజీ సిద్ధార్థ మృతి కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కంపెనీ ఉద్యోగులు, ఉన్నతాధికారులే మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. సిద్దార్థ పేరును ఉపయోగించుకొని కోట్లాది రూపాయలు దండుకున్నారు. రైతుల పేరుతో బోగస్ పత్రాలు సమర్పించి ఓ ప్రైవేటు బ్యాంకులో అడ్డదారిలో రుణాలు తీసుకున్నారు. కంపెనీ ఉన్నతాధికారి తోపాటు కొందరు ఉద్యోగులు కలసి కుట్రలు చేశారు. తమిళనాడు కేంద్రంగా పని చేస్తున్న ఓ ప్రైవేటు బ్యాంకులో 145 కోట్ల మేర రుణాలు తీసుకున్నారు. ఐటీ శాఖ దర్యాప్తులో ఈ విషయాలు బయటపడ్డాయి..

సిద్ధార్థ మరణాంతరం సీసీడీకి చెందిన ఆర్థిక వ్యవహారాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు విచారణ మొదలుపెట్టారు. ఈ క్రమంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సీసీడీకి చెందిన ఉద్యోగులు, ఉన్నతాధికారులు... రైతుల పేరుతో నకిలీ పత్రాలు సమర్పించి కోట్ల రూపాయల రుణాలు పొందారు. సిద్ధార్థ మరణాంతరం సీసీడీ బోర్డులో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఓ ఉన్నతాధికారి ఇదే విధంగా రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది..

ఉద్యోగులు, ఉన్నతాధికారులు తమను కర్ణాటకలోని చిక్‌మగళూర్‌లో కాఫీ సాగు చేస్తున్న రైతులుగా పేర్కొంటూ బ్యాంకులకు బోగస్ పత్రాలు సమర్పించారు. ఈ పేపర్స్ సీసీడీ గ్రూపు అందించినట్లుగా ఉండడంతో బ్యాంకులు ముందూ వెనకా చూసుకోకుండా రుణాలు మంజూరు చేశాయి. ఈ నగదును ఇతర మార్గాల ద్వారా సీసీడీ గ్రూపునకు చెందిన ఇతర కంపెనీలకు ఐటీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ కేసులో... అనేక కొత్త అంశాలు వెలుగు చూస్తుండటంతో... దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు ఐటీ అధికారులు.

Tags

Read MoreRead Less
Next Story