ఆదిలాబాద్‌ జిల్లాలో కాల్పుల కలకలం.. పది ఊర పందులు మృతి

ఆదిలాబాద్‌ జిల్లాలో కాల్పుల కలకలం.. పది ఊర పందులు మృతి
X

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌నగర్‌లో కాల్పులు కలకలం రేపాయి. ఈ ఉదయం ఊర పందులను హతమార్చే క్రమంలో ఈ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే కాల్పులు ఎవరు జరిపారు? ఎందుకు జరిపారు? నిజంగానే పందులను చంపేందుకు కాల్పులు జరిపారా? మనుషులు టార్గెట్‌గా ఫైర్‌ చేశారా? అన్నది తెలియాల్సి ఉంది.

గుర్తు తెలియని వ్యక్తి కాల్పుల్లో దాదాపు పది వరకు ఊర పందులు మృతి చెందాయి. పందులకు బుల్లెట్‌ గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉదయం పూట ఒక్కసారిగా కాల్పుల శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కొన్ని బుల్లెట్లు ఇంట్లోకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది.

వెంటనే కాల్పుల విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. స్పాట్‌లో పలు ఆధారాలు సేకరించి స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాల్పులకు ఎవరు జరిపారు? ఎందుకు జరిపారు? అన్నదానిపై పూర్తి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story