గేదెను అలా పూడ్చి పెట్టడం వల్లే ఇలా జరిగిందంటూ...

గేదెను అలా పూడ్చి పెట్టడం వల్లే ఇలా జరిగిందంటూ...

వర్షాలు పడకపోతే ఏం చేస్తారు. చాలా చోట్ల ఆ భారాన్ని దేవుడిపై వేస్తారు. కప్పల పెళ్లిల్లు లాంటి వింత ఆచారాలన్నీ పాటిస్తారు. కానీ సూర్యాపేట జిల్లాలోని ఓ గ్రామస్తులు మూఢనమ్మకాల్లో మరో అడుగు ముందుకేశారు. ఏడాది క్రితం కరెంట్‌ షాక్‌తో పాడి గేదె చనిపోయింది. దాన్ని అలాగే తీసుకెళ్లి ఓ వాగులో పూడ్చిపెట్టారు. కాలం గిర్రున తిరిగి సీజన్‌ మారింది. ఆ గ్రామంలో వర్షాలు పడటంలేదు. ఊళ్లో పెద్దలంతా మేధోమథనం చేసి కారణాలు ఆలోచించారు. పాడి గేదెను అలా పూడ్చి పెట్టడం వల్లే గ్రామానికి అరిష్టం జరిగిందని తేల్చారు. సర్పంచ్‌ ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. యుద్ధ ప్రాతిపదికన రాత్రి వెళ్లి గేదె సమాధి తవ్వి మరో చోట పూడ్చారు.

ఈ ఘటన అడ్డగుడూర్‌ మండలం కోటమర్తి గ్రామంలో జరిగింది. చింత సోమయ్య రైతు గేదె ఏడాది క్రితం చనిపోగా.. ఇప్పుడు మళ్లీ ఇలా లొకేషన్‌ మార్చి ఖననం చేశారు. ఇప్పుడైతే గేదెనే మళ్లీ పూడ్చారు, కానీ పదేళ్ల క్రితం ఓ నిండు గర్భిణీ మరణిస్తే ఊరికి అరిష్టం పట్టిందని రెండోసారి పూడ్చి పెట్టారట.

Tags

Read MoreRead Less
Next Story