ఆంధ్రప్రదేశ్

250 మందికి రెండు బాత్‌రూమ్‌లా

250 మందికి  రెండు బాత్‌రూమ్‌లా
X

శ్రీకాకుళం పట్టణంలోని బీసీ హాస్టల్‌ విద్యార్థులు రోడ్డెక్కారు. కనీస మౌలిక వసతులు లేవంటూ ఆందోళన బాట పట్టారు. తమ వసతి గృహంలో చాలీ చాలని గదుల్లో ఇరుకిరుకుగా ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్‌లో రెండు వందల యాబై మందికి కేవలం రెండు బాత్‌రూంలు ఉన్నాయని, పురుగులు ఉండే అన్నం పెడుతున్నారంటూ మండిపడ్డారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడంతో.. సమస్యల పరిష్కారం కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కలక్టరేట్‌కు ర్యాలీగా బయలుదేరారు. ఆ ర్యాలీని మద్యలోనే పోలీసులు అడ్డుకున్నారు.. ఆందోళన బాట పట్టిన విద్యార్థులను అరెస్ట్‌ చేశారు. ఈ అరెస్ట్‌లను ప్రతిఘటించిన విద్యార్థులు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు.

Next Story

RELATED STORIES