భార్య మీద అనుమానంతో..
X
By - TV5 Telugu |5 Aug 2019 11:02 AM IST
వికారాబాద్‌లోని మోతిబాగ్ పాత మహిళా పోలీస్ స్టేషన్ సమీపంలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యా పిల్లలను కిరాతకంగా హత్య చేశాడు ఓ భర్త.. గత కొంతకాలంగా కాపురంలో కలహాలకు తోడు భార్య చాందినిపై అనుమానం పెంచుకున్న ప్రవీణ్ కుమార్.. క్షణికావేశానికి లోనై భార్యతో సహా పిల్లపై దాడి చేశాడు. దీంతో 30 ఏళ్ల చాందిని, 10 ఏళ్ల కొడుకు అయాన్, 5 ఏళ్ల కూతురు ఏంజెల్ మృతి చెందారు. భార్యమీద అనుమానంతో కన్న బిడ్డలను కూడా పొట్టన పెట్టుకున్నాడు కసాయి తండ్రి.. స్థానికుల ఫిర్యాదుతో ప్రవీణ్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు వికారాబాద్ పోలీసులు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com