జోడి మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

జోడి మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

యూత్ ఫుల్ స్టార్ ఆది సాయికుమార్ లేటెస్ట్ గా మరో మూవీతో రాబోతున్నాడు. కన్నడ బ్యూటీ, ‘జెర్సీ’ ఫేమ్ శ్రధ్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. 'జోడి' మూవీ షూటింగ్ పూర్తయింది. సెప్టెంబర్ 6న జోడి సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయటానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ మధ్య విడుదల చేసిన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. వాన, మస్కా, సినిమా చూపిస్త మామ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన విశ్వనాథ్ అరిగెల ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. భావనా క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీనివాస్ గుర్రం సమర్పిస్తోన్న ఈ చిత్రానికి ‘నీవే’ ఫణికళ్యాణ్ సంగీతం అందించారు.

Tags

Read MoreRead Less
Next Story