జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

కాపు రిజర్వేషన్ల అంశాన్ని.. జమ్మూ కశ్మీర్‌ సమస్యతో పోల్చుతూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్‌ వంటి క్లిష్టమైన సమస్యలకే పరిష్కారం కనుగొంటున్నప్పుడు ఏపీలో కాపు సమస్యను పరిష్కరించడం చాలా సులభమని అన్నారు. కాపుల రిజర్వేషన్‌ను జగన్‌ రాజకీయ కోణంలో చూస్తున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన పోలవరం, అమరావతిలకు పక్కన పెట్టినట్లే కాపు రిజరేషన్‌ అంశాన్ని పక్కన పెడుతున్నారని ఆరోపించారు.

అటు ఏపీకి ప్రత్యేక హోదాపై పవన్‌ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా అడిగిన వారే ఇప్పుడు దానికి తూట్లు పొడుస్తూ.. వ్యతిరేక పంథాలో అవలంభిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల్లో ఉన్న భావోద్వేగం ఏపీ ప్రజల్లో లేదని అన్నారు. నాయకుల్లో ప్రజల్లో ఆవేదన ఉంటేనే హోదా సాధ్యమవుతుందని పేర్కొన్నారు పవన్‌.

Tags

Next Story