మాంగారు.. సైరా ఎందుకు చూడాలంటారు.. కోడలి ప్రశ్న

మెగాస్టార్ కోడలు.. అపోలో హాస్పిటల్స్ చైర్మన్ మనవరాలు.. అయినా ఉపాసన తన సొంత వ్యక్తిత్వాన్ని చాటుకుంటుంది. బి పాజిటివ్ హెల్త్ మ్యాగజైన్ రన్ చేస్తూ ప్రముఖ వ్యక్తులను, సెలబ్రిటీలను ఇంటర్వ్యూచేస్తుంది. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది. మంచి కోడలుగా మామగారి దగ్గరనుంచి మార్కులు కొట్టేసిన ఉపాసన.. ఈసారి ఆయనకు ప్రశ్నలు సంధించింది. మ్యాగజైన్ కోసం ఆయన్ను ఇంటర్వ్యూ చేసింది. పలు రకాల ప్రశ్నల పరంపరలో అడిగిన ప్రశ్న ఆయన్ని ఆశ్చర్యపరిచింది. మీరు నటించిన సైరా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది కదా.. మరి ఈ సినిమా ద్వారా ఏం సందేశం ఇవ్వబోతున్నారు. అసలు ఎందుకు చూడాలంటారు అని ఉపాసన చిరుని ప్రశ్నించారు. అందుకు ఆయన కూడా అంతే ఆసక్తిగా సమాధానం చెప్పారు. నేటి తరానికి సైరా సినిమా చాలా అవసరం. ఆనాటి అమర వీరుల త్యాగఫలం.. మనం నేడు అనుభవిస్తున్న స్వాతంత్ర్యం . ఆ విషయాన్ని మరిచిపోతున్నాం. వారి త్యాగాల గురించి తెలుసుకున్నప్పుడు విభిన్న భావోద్వేగాలను చూపించాల్సి వస్తుంది. ఆ మహానుభావుల త్యాగాలతోనే ఈ స్వాతంత్ర్యం వచ్చింది అనే విషయాన్ని సైరాలో చూపించాము అని చిరు సమాధానం చెప్పారు. అందుకే ఇలాంటి చిత్రాలు ప్రతి ఒక్కరు చూడాలని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

