శ్యామలా.. ఏంటిలా.. నెటిజన్స్ ట్రోల్

శ్యామలా.. ఏంటిలా.. నెటిజన్స్ ట్రోల్

తెలుగింటి ఆడపడుచుకు నిండైన నిదర్శనంలా ఉంటుంది యాంకర్ శ్యామల. బుల్లితెరపై సందడి చేస్తూ అభిమానులను సంపాదించుకుంది. పక్కింటి అమ్మాయిలా కనిపించే శ్యామలను తమ ఇంటి ఆడపడుచుగా చూసుకున్నారు బుల్లితెర ప్రేక్షకులు. బిగ్‌బాస్‌ హౌస్‌కి వెళ్లి వచ్చిన ఆమెను.. అభిమానులు ఒకసారి ఎలిమినేట్ చేసినా మరోసారి హౌస్‌కి రావాలని కోరుకున్నారు. అంతటి అభిమానాన్ని సంపాదించుకున్న శ్యామల ఇప్పుడేంటి ఇలా.. ఆ డ్రెస్సింగ్ ఏంటి.. ఎందుకు ఇలాంటి డ్రెస్‌లు వేసుకుని పోస్టులు పెడతారు. మీకు మా హృదయంలో మంచి స్థానం ఉంది. దాన్ని పోగొట్టుకోకండి అంటూ సున్నితంగా మందలిస్తున్నారు.

శ్యామల సీరియల్స్‌, సినిమాల్లోనూ నటించింది. లయ, అభిషేకం సీరియల్స్ ద్వారా పాపులర్ అయింది. మా ఊరి వంట, పట్టుకుంటే పట్టుచీర కార్యక్రమాల ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు అభిమాన యాంకర్ అయిపోయింది. ఇక లౌక్యం, ఒక లైలా కోసం, గుండెల్లో గోదారి వంటి సినిమాల్లోనూ నటించింది. సహ నటుడు నరసింహను 2007లో వివాహం చేసుకుంది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. ఎక్కువమందికి తెలిసింది మాత్రం బిగ్‌బాస్ ద్వారానే. బయటకు వచ్చిన తరువాత మరిన్ని షోలు, ఈవెంట్లలో కనిపిస్తూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది శ్యామల. తాజాగా ఫోటో షూట్ చేసి వాటిని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. అవి చూసి అభిమానులు శ్యామలను మందలిస్తున్నారు. మీకున్న మంచి పేరుని చెడగొట్టుకోకండి అని అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story