వైసీపీ నేతలను మేపడానికేగా ఇదంతా? - చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరతపై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు. ముందస్తు ప్రణాళిక లేకుండా పాత ఇసుక విధానాన్ని రద్దు చేయడంపై తీవ్రంగా మండిపడ్డారాయన. కొత్త విధానం ఎప్పుడో తీరిగ్గా వస్తుందట, ఏమిటీ పిల్లల ఆటలంటూ ట్వీట్‌లో ఫైరయ్యారు. వ్యవస్థలో మార్పులు తేవాలంటే, ముందు ఒక ప్రణాళిక తయారు చేసుకొని, సాధ్యాసాధ్యాలు బేరీజు వేసుకోవాలని చెప్పారు చంద్రబాబు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి, మొండిగా నిర్ణయాలు తీసుకుంటారా అని ప్రశ్నించారు.? ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాని పర్యావసానాలు ఆలోచించరా అని నిలదీశారు. ఇసుక కొరతతో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సొంతింటి కలలు కడతేరిపోయాయన్నారు. ట్రాక్టర్ ఇసుక 10 వేల రూపాయలు అంటే, వైసీపీ నేతలను మేపడానికే పాత విధానాన్ని రద్దు చేశారా అంటూ విమర్శలు గుప్పించారు.

Tags

Next Story