ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్‌ భేటీ

ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్‌ భేటీ
X

పార్లమెంట్ కార్యాలయంలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు ఏపీ సీఎం జగన్‌. దాదాపు 45 నిమిషాల పాటు భేటీ కొనసాగింది. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని ప్రధానిని కోరారు సీఎం జగన్‌. రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక సాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు.. కేంద్రం అందించాల్సిన సహాయసహకారాలపై మోదీకి జగన్‌ వినతి పత్రం అందజేశారు. జగన్‌ వెంట వైసీపీ ఎంపీలు కూడా ఉన్నారు.

Tags

Next Story