నుదిటిపై కుంకుమ.బొట్టు.. ఆకట్టుకునే చీరకట్టు.. ఆమె ఓ ట్రెడిషనల్ ఐకాన్

నుదుటన కుంకుమ బొట్టు.. ఆకట్టుకునే చీరకట్టు. సుష్మాలో భారతీయ సంప్రాదాయం ఉట్టిపడేది. స్వదేశం,విదేశం ..వేదిక ఏదైనా ఆమె కట్టూబొట్టూలో భారత సంస్కృతి ప్రతిబింబించేది. మాటతీరు, విషయ పరిజ్ఞానం అలానే ఉండేవి. అమె మాట్లాడుతుంటే ఎక్కడ నిశబ్ధం అలుముకుంటుది. ఇండియన్ ట్రెడిషన్‌కు ఆమె ఓ ఐకాన్.
కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ హఠాన్మరణం చెందారు. ఈ చేదువార్తను బీజేపీ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సుష్మ పార్ధీవ దేహానికి నివాళులు అర్పించారు. ఆమె కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.
నిండైన భారతీయతకు నిలువెత్తు రూపం సుష్మాస్వరాజ్. నుదుట సింధూరంతో.. చక్కనైన చీరకట్టుతో.. ఆపై ఒక కోట్‌తో.. ఎవరైనా పేరు ప్రస్తావించగానే మన కళ్లముందు మెదులుతారు. తన మాటల్లో నిప్పులు కురిపించగలరు. అదే మాటలతో మమకారాన్ని పంచగలరు. ఛలోక్తులు విసరగలరు. సమయస్ఫూర్తితో ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టగలరు. ఆమె టీవీలో కనిపిస్తుంటే.. చేస్తున్న పని ఆపేసి చూడాలనిపిస్తుంది. పేపర్లలో రాసింది వెంటనే చదవాలనిపిస్తుంది. అత్యద్భుతంగా మాట్లాడే అతికొద్దిమంది ఉత్తమ పార్లమెంటేరియన్‌లలో సుష్మా పేరు తప్పకుండా ఉంటుంది. రాజకీయాలంటే పదవులు, అధికారాకం కాదని.. విలువలు, ప్రజాసేవ అని చాటిచెప్పిన లీడర్‌గా సుష్మ పేరు తెచ్చుకున్నారు. భర్త స్వరాజ్ కౌశల్ ప్రోత్సాహంతో రాజకీయాల్లో రాణించిన సుష్మ.. చిన్నమ్మగా తెలుగుప్రజల గుండల్లోనూ సంపాదించుకున్నారు.
పాతికేళ్లకే హర్యానా కేబినెట్ మంత్రి అయ్యారంటే సుష్మాస్వరాజ్ సమర్థతకు వేరే ఉదాహరణ అవసరమే లేదు. ఢిల్లీ తొలి మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి.. యావత్ దేశం దృష్టి తనవైపు తిప్పుకున్నారు. 6 సార్లు ఎంపీగా, 3సార్లు ఎమ్మెల్యేగా ప్రజాజీవితంతో సుష్మాది వీడదీయరాని బంధం. 1970లో ABVPతో ప్రస్థానం మొదలుపెట్టిన సుష్మ.. వాజ్‌పేయి హయాంలో సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. మోదీ కేబినెట్‌లో విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నో చారిత్రక నిర్ణయాలతో తన మార్క్ నిలబెట్టుకున్నారు. అంతర్జాతీయ సమాజం ముందు పాక్‌ను దోషిగా నిలబెట్టడంలోను, విదేశాల్లో చిక్కుకున్న ప్రవాసభారతీయులకు అండదండలు అందించడంలోనూ.. ఒకటనేమిటి తన దృష్టికి వచ్చిన ప్రతి అంశంపైన, ప్రతి సందర్భంలోనూ చేయాల్సిందందా చేశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన తొలి మహిళగానూ ఆమెకు గుర్తింపు ఉంది. 2019 ఎన్నికల్లో అనారోగ్య కారణాలతో పోటీకి దూరంగానే ఉన్నా.. ట్విట్టర్ ద్వారా సందర్భానుసారం తన అభిప్రాయాలు స్పష్టం చేస్తూ అందరికీ దగ్గరగానే ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com