కశ్మీరీలతో కలిసి భోజనం చేసిన అజిత్ ధోవల్

కశ్మీరీలతో కలిసి భోజనం చేసిన అజిత్ ధోవల్
X

జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ ధోవల్‌ రూటేవేరు. మిగతా వారు ఆలోచించడానికే భయపడే పనులను ఆయన సులువుగా చేసేస్తారు. ప్రస్తుతం కశ్మీర్‌ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఎప్పుడు ఏం జరుగుతోందోనని అందరూ భయపడుతున్నారు. ముఖ్యంగా వీఐపీలు అక్కడ అడుగు పెట్టేందుకే జంకుతున్నారు. కానీ అజిత్‌ ధోవల్‌ మాత్రం కశ్మీర్‌లో పర్యటించడమే కాదు... ఏకంగా అక్కడి వీధుల్లో సాధారణ పౌరుడిగా స్ట్రీట్‌ ఫుడ్‌ లాగించారు. స్థానికులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ.. స్థానికుల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే కశ్మీర్‌లో పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని భరోసా ఇచ్చారు.

Tags

Next Story