ఆ అంశాలనే జగన్ ప్రభుత్వం అడగటం విడ్డూరం : ఎంపీ జీవీఎల్
BY TV5 Telugu8 Aug 2019 9:56 AM GMT

X
TV5 Telugu8 Aug 2019 9:56 AM GMT
ఓట్ల కోసమే గత ప్రభుత్వాలు కశ్మీరీలను వాడుకున్నాయని బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహారావు అన్నారు. రాజకీయాలను పక్కనపెట్టి ఆర్టికల్ 370 రద్దుకు చాలా పార్టీలు సహకారం అందించాయన్నారు. లిఖిత పూర్వకంగా రామయ్యపట్నంలో పోర్టు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరితే పోర్టు పనులు ప్రారంభమవుతాయన్నారు జీవీఎల్. ఏపీలో కొత్త ప్రభుత్వ నిర్ణయాలు, గతంలో చంద్రబాబు తీసుకున్నట్టుగానే ఉన్నాయన్నారు. గతంలో సాధ్యంకావని చెప్పిన అంశాలనే జగన్ ప్రభుత్వం మళ్లీ అడగటం విడ్డూరమన్నారు జీవీఎల్.
Next Story