మేక ధర అక్షరాల లక్ష కాదు.. రూ.8 లక్షలు..

మేక ధర అక్షరాల లక్ష కాదు.. రూ.8 లక్షలు..
X

బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని మార్కెట్ నిండా మేకలు, గొర్రెలు దర్శనమిస్తున్నాయి. వీటి ధరలు కూడా వేలల్లో ఉంటున్నాయి. బక్రీద్ కోసమనే కొందరు మేకల్ని, గొర్రెల్ని పెంచి పోషిస్తుంటారు. వాటిని మంచి ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటారు. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పైర్‌కు చెందిన అబ్‌రార్ ఖాన్ కొన్ని రోజులుగా ఓ మేకను పెంచుతున్నాడు. దానికి బాదం, జీడిపప్పు, కిస్ మిస్ ప్రతి రోజు ఆహారంగా ఇచ్చేవాడు. రోజూ ఓ గంట ఆయిల్ మసాజ్ కూడా చేయించేవాడు. ఖర్చుకి ఏ మాత్రం వెనుకాడకుండా మేకకు మంచి ఫుడ్డు పెట్టి బరువు 211 కిలోలకు పెంచేశాడు. దాన్ని చూడగానే కొనడానికి చాలా మంది ముందుకు వచ్చినా రేటు చూసి వెనుకడుగు వేస్తున్నారు. నా బుజ్జి మేక ఖరీదు రూ.8 లక్షలకు ఒక్క పైసా కూడా తగ్గేది లేదంటున్నాడు. కనీసం రూ.6 లక్షలకన్నా ఇవ్వు బాబు అని అడుగుతుంటే కూడా ఇవ్వట్లేదు. ఎలాగూ ఇక్కడి వరకు వచ్చారు. ఇంకో లక్ష వేసి కనీసం రూ.7 లక్షలు పెట్టి కొనుక్కెళ్లే వాళ్లు దొరక్కపోతారా అని ఎదురు చూస్తున్నాడు అబ్‌రార్. చూడాలి మరి ఎంతకు వెళుతుందో ఈ మేక ధర.

Tags

Next Story