మద్యం మత్తులో ఎస్‌ఐ హల్‌చల్‌

మద్యం మత్తులో ఎస్‌ఐ హల్‌చల్‌

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో మహారాష్ట్ర ఎస్‌ఐ మద్యం మత్తులో హల్‌చల్‌ చేశాడు. వాంకిడి మండలంలోని గణేష్‌పుర్‌ గ్రామంలోని పశువుల సంతలో వ్యాపారులను బెదిరించే ప్రయత్నం చేశాడు. తనదగ్గర ఉన్న రివాల్వర్‌తో లారీ డ్రైవర్లను ఆపి.. పశువులను ఎక్కడికి తరలిస్తున్నారని.. తన పర్మిషన్‌ తీసుకోకుండా ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించాడు. వెంటనే తనకు డబ్బులు ఇవ్వకపోతే పేల్చాస్తానంటూ రివాల్వర్‌తో బెదిరింపులకు దిగాడు. గ్రామస్థులంతా ఒక్కటై ఎస్‌ఐను అడ్డుకుని రివాల్వర్‌ లాక్కుని.. వాంకిడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. మహారాష్ట్ర ఎస్‌ఐను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story