వరద ఉధృతి.. నీటిలో కొట్టుకుపోయిన యువకుడు

వరద ఉధృతి.. నీటిలో కొట్టుకుపోయిన యువకుడు

ములుగు జిల్లా ధర్మారం చెరుకూరులో అదృష్టవశాత్తూ ఓ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు నీటిలో చిక్కుకుపోయిన యువకుడ్ని స్థానికులు ప్రాణాలకు తెగించి కాపాడారు.

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు.. వాజేడు మండలం ధర్మారం గ్రామం దగ్గర ఉన్న వంతెనపై నీరు ప్రవహిస్తోంది. ధర్మారం నుంచి చెరుకూరు వైపు వస్తున్నయువకుడు ఆ నీటిలోనే వంతెనె దాటేందుకు ప్రయత్నించాడు. వరద ఉధృతి ఇంకాస్త పెరగడంతో బైక్‌పై వస్తున్న యువకుడు నీటిలో కొట్టుకుపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఒకరి సహాయం ఒకరు తీసుకుంటూ యువకుడ్ని రక్షించారు.

Tags

Read MoreRead Less
Next Story