వాసిరెడ్డి పద్మకు కీలక పదవి

వాసిరెడ్డి పద్మకు కీలక పదవి
X

ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీవో జారీ చేసింది. ఆమె ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పదవికి నన్నపనేని రాజకుమారి బుధవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆమె రాజీనామా లేఖను గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ వెంటనే ఆమోదించారు.

Tags

Next Story