బాలుడి అదృశ్యం.. వీడిన మిస్టరీ

బాలుడి అదృశ్యం.. వీడిన మిస్టరీ

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామానికి చెందిన బాలుడి అదృశ్యం మిస్టరీ వీడింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. హుటాహుటిన పోలీసులు సంఘాటనాస్థలానికి చేరుకోగా కొన ఊపిరితో కొట్టుకుంటున్న బాలుడు కనిపించాడు. వెంటనే దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం బాలుడిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదృశ్యమైన బాలుడు కనిపించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ధనుష్‌ను ఎందుకు కిడ్నాప్ చేశారు.. బాలుడు అపస్మారక స్థితికి చేరుకోవడానికి గల కారణాలపై పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story