క్రికెట్‌లోకి ట్రాన్స్‌జెండర్లు

క్రికెట్‌లోకి ట్రాన్స్‌జెండర్లు

ఇనాళ్ళూ క్రీడల్లో వివక్ష ధోరణులను చూశాం. కానీ ఇప్పుడు ఆ వివక్షలను రూపుమాపేలా ఓ వినూత్న ఆలోచనకు తెర లేపింది క్రికెట్‌ ఆస్ట్రేలియా. క్రికెట్‌లో ఇనాళ్ళు మెన్, ఉమెన్స్‌ను మాత్రమే చూశాం. అయితే క్రికెట్‌ ఆస్ట్రేలియా లింగ వివక్షకు అవకాశం లేకుండా ఇక నుంచి ట్రాన్స్‌జెండర్లకు సైతం క్రికెట్‌లో అవకాశమివ్వాలని నిర్ణయించుకుంది. ట్రాన్స్‌జెండర్లను కూడా జట్టులో ఆడించాలని అనుకుంటున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తెలిపింది. ఈ విషయాన్ని ట్విటర్‌లో పోస్టు చేస్తూ.. #ASportForAll అనే హ్యాష్‌టాగ్‌ను జతచేసింది. క్రీడల్లో లింగ సమానత్వాన్ని పెంపోదించేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే ఈ నిర్ణయంపై అభిప్రాయాలు తెలపాలని క్రికెట్‌ అభిమానులను క్రికెట్‌ ఆస్ట్రేలియా కోరింది. ఈ నిర్ణయంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయం పట్ల అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా ట్రాన్స్‌జెండర్లను ఆడించాలన్న నిర్ణయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో వేచిచూడాలి.

Tags

Next Story