వెల్లూరు లోక్‌సభ ఎన్నికలో డీఎంకే పార్టీ ఘనవిజయం

వెల్లూరు లోక్‌సభ ఎన్నికలో డీఎంకే పార్టీ ఘనవిజయం
X

తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికలో ప్రతిపక్ష డీఎంకే పార్టీ ఘన విజయం సాధించింది. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో డీఎంకే అభ్యర్థి కతీర్ ఆనంద్ తన సమీప ఏఐడీఎంకే ప్రత్యర్థి ఎసి షణ్ముగంపై 8,141 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ విజయంతో లోక్‌సభలో డీఎంకే ఎంపీల బలం 24కు చేరింది. లోక్‌సభలో మూడో అతిపెద్ద పార్టీగా డీఎంకే ఇప్పటికే ఉంది. వెల్లూరులో డీఎంకే విజయం సాధించడంతో ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద కార్యకర్తల సంబరాలు చేసుకున్నారు. ఈనెల 5న వెల్లూరు లోక్‌సభ ఎన్నికకు పోలింగ్ జరిగింది. ఇదిలావుంటే సాధారణ ఎన్నికల సమయంలో డీఎంకే అభ్యర్ధికి చెందిన గిడ్డంగుల్లో భారీగా నగదు పట్టుబడటంతో అప్పట్లో పోలింగ్ రద్దయింది.

Tags

Next Story