మహేష్ సరిలేరు నీకెవ్వరు.. పుట్టిన రోజు శుభాకాంక్షలు

మహేష్ సరిలేరు నీకెవ్వరు.. పుట్టిన రోజు శుభాకాంక్షలు

మహేష్ బాబు బార్న్ విత్ సిల్వర్ స్క్రీన్. పెద్దగా కష్టపడకుండానే సినిమాల్లోకి వచ్చాడు. కానీ స్టార్డమ్ మాత్రం అంత ఈజీగా రాలేదు. స్టార్ వార్ లో ఎన్నో హర్డిల్స్ ని దాటుకుని సూపర్ స్టార్ అయ్యాడు. ఫ్లాప్స్ వచ్చినప్పుడు నిరాశ పడకుండా ఖలేజా ఉన్న కథలతో దూకుడు చూపించి టాప్ లేపేశాడు మహేష్ బాబు. సూపర్ స్టార్ తనయుడైనా.. తనూ సూపర్ స్టార్ అనిపించుకోవడానికి చాలాకాలం ఎదురుచూశారు. ఆ ఎదురుచూపుకు ఫలితం.. ఇప్పుడు మహేష్ బాబు టాలీవుడ్ నెంబర్ వన్ హీరో. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' మూవీ చేస్తున్నాడు మహేష్. నేడు (ఆగస్టు 9) సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే. ఈ సందర్భంగా.. ప్రిన్స్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. మూవీ యూనిట్ ఓ వీడియోని రిలీజ్ చేసింది. ఈ వీడియోని మహేష్ అభిమానులు షేర్లు చేస్తూ.. బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story