అప్పుడు అమ్మానాన్నకు ఇష్టంలేదు.. ఇప్పుడు మా ఆయనకు ఇష్టం.. అందుకే..

అప్పుడు అమ్మానాన్నకు ఇష్టంలేదు.. ఇప్పుడు మా ఆయనకు ఇష్టం.. అందుకే..

ప్రధాన పాత్రలో ఓ సినిమాలో నటిస్తానని, సింగిల్‌గా తన పోస్టర్ వస్తుందని అస్సలు ఊహించలేదు అంటోంది అనసూయ. ఇప్పుడు కథనం చిత్రంలో కథ అంతా నా పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అందులో నేనే హీరోయిన్. అయినా ఆ ఫీల్ అనేది కనిపించకుండా డైరక్టర్ రాజేష్ నాదెండ్ల చెప్పింది చేశాను అని అనసూయ తన చిత్రం రిలీజ్ సందర్భంగా మీడియాతో ముచ్చటించింది. ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఏదీ అనుకోని జరగదు. ఎంబీఏ చేసి ఉద్యోగం చేసుకుంటున్న తరుణంలో పేపర్‌లో వచ్చిన ఓ యాడ్ చూసి అప్లై చేశాను. పెళ్లికి ముందే సినిమాల్లో అవకాశాలు వచ్చినా నటించలేదు. అప్పుడు అమ్మానాన్న ఒప్పుకోలేదు. కానీ పెళ్లయిన తరువాత మా ఆయన సపోర్ట్ చాలా ఉంది. అందుకే సినిమాల్లో నటించగలుగుతున్నాను. బుల్లితెర మీద యాంకరింగ్ చేయగలుగుతున్నాను. అందుకే టీవీ కెమెరాకు, సినిమా కెమెరాకు పెద్దగా తేడా అనిపించదు. రెంటినీ ఒకేలా భావిస్తూ దర్శకుడు చెప్పింది చేస్తుంటాను.

రంగస్థలం సినిమాలో నా పాత్రకు అంత ప్రాముఖ్యత ఉందని అనుకోలేదు. డైరక్టర్ సుకుమార్ చెప్పింది చేశాను. కథనం సినిమాలో నేను లీడ్‌గా ఉండడాన్ని బాధగా ఫీల్ కావడం లేదు. ఓ బాధ్యతగా భావిస్తున్నాను. ఇక కుటుంబ విషయానికి వస్తే మంచి ఫ్యామిలీ దొరికింది. అది దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. ఒకప్పుడు సోషల్ మీడియాలో ఏమైనా కామెంట్ చేస్తే వెంటనే రియాక్ట్ అయ్యేదాన్ని. ఇప్పుడు కాస్త ఓపిక పెరిగి ప్రతి దాన్ని సీరియస్‌గా తీసుకోవలసిన అవసరం లేదని అనిపించింది. తరుణ్ భాస్కర్ డైరక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాను. ఏజ్ అనేది ఓ నెంబర్ మాత్రమే అని నమ్ముతాను. సినిమా చూసి ఇంటికి వెళ్లాక కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలే చేయాలనుకుంటున్నాను.

Tags

Read MoreRead Less
Next Story