పొలంబాట పట్టిన కలెక్టర్‌ దంపతులు

పొలంబాట పట్టిన కలెక్టర్‌ దంపతులు

ఖమ్మం జిల్లా కలెక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్ రైతు సమస్యలు తెలుసుకునేందుకు పొలంబాట పట్టారు. జిల్లా అధికారిగా ఆయన వెళ్లడంలో ఎలాంటి ప్రత్యేకత లేదు.. కానీ ఆయన సతీమణి ప్రియాంక సైతం కూడా ఆయనతో పాటు.. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లడం విశేషం. అయితే ఆమె కూడా జిల్లా ఉన్నతాధికారే కావడం విశేషం. ఆమె ప్రస్తుతం జిల్లా పరిషత్‌ సీఈవోగా పనిచేస్తున్నారు. జిల్లాలోని ఎన్కూరు మండలంలో పలు గ్రామాల్లో పంట పొలాలను పరిశీలిస్తూ.. గట్లపై బురదలో నడుస్తూ రైతుల సమస్యలు అడిగితెలుసుకున్నారు. ఇద్దరూ అలా కలిసిమెలిసి పనిచేయడం రైతులను ఆనందానికి గురిచేసింది. గతంలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇరువురు కలిసివెళ్లిన సందర్భాలను అధికారులు గుర్తుచేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story