యువకుడిని తలకిందులుగా చెట్టుకు వేలాడదీసి అతి దారుణంగా..

యువకుడిని  తలకిందులుగా చెట్టుకు వేలాడదీసి  అతి దారుణంగా..

ఓ దొంగను చెట్టుకు కట్టేసి అతి దారుణంగా హింసించిన ఘటన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో వెలుగుచూసింది. మెుబైల్ చోరీ చేశాడనే అనుమానంతో ఓ వ్యక్తిని స్ధానికులు తాడుతో చేట్టుకు వేలాడదీసి చితకబాదారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వారం రోజుల క్రితం ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఫోన్‌ దొంగిలించాడనే ఆరోపణలతో ఓ టీనేజర్‌పై మూకదాడి చేయడంతో తీవ్ర గాయాలైన బాధితుడు స్పాట్‌లోనే మృతిచెందాడు. ఓ ఇంట్లో ఫోన్ దొంగిలించాడనే అనుమానంతో ఆ యువకుడు ఇంటి వద్ద ఉన్నసమయంలో బయటకు తీసుకువచ్చి స్ధానికులు దాడి చేశారు. ఈ దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ ఫోన్‌ను తమ కుమారుడు దొంగతనం చేయలేదని అనవసరంగా అతన్ని పొట్టనపెట్టుకున్నారని ఆ యువకుడి తల్లిదండ్రులు వాపోయారు. బాధితుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story