నాగార్జున వయసు 60 కాదు 20.. 'మన్మథుడు 2' ట్విట్టర్ రివ్యూ..

నాగార్జున వయసు 60 కాదు 20.. మన్మథుడు 2 ట్విట్టర్ రివ్యూ..

కొడుకులతో పోటీ పడుతూ కుర్రకారు హీరోలా ముద్దులు, కౌగిలింతల సీన్లలో నటిస్తూ యంగ్‌హీరోల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు హీరో అక్కినేని నాగార్జున. 17 ఏళ్ల క్రితం వచ్చిన మన్మథుడు సినిమా ఎప్పుడు చూసినా బోర్ కొట్టదు. అదే పేరుతో సినిమా తీసి మరో సారి హిట్ కొట్టాలనుకున్నారు నాగార్జున. కొడుకు నాగచైతన్య పక్కన హీరోయిన్‌గా నటించిన రకుల్‌తో స్టెప్పులేశారు. లిప్‌లాక్‌లు, డబుల్ మీనింగ్ డైలాగులు ఉండడంతో ఈ చిత్రానికి సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికెట్ జారీ చేసారు. అన్నపూర్ణ స్టూడియోతో పాటు ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. మొదటి సినిమా చి.ల.సౌతోనే హిట్ కొట్టిన రవీంద్రన్ ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నారు.

చిత్రంలో నాగార్జునతో పాటు రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్‌లు ప్రధాన పాత్రలో పోషించారు. ఇతర ముఖ్యపాత్రల్లో వెన్నెల కిషోర్, నాజర్, రావు రమేష్, లక్ష్మీ నటించారు. ఎం. సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి ఛోటా కె. ప్రసాద్, బి.నాగేశ్వర రెడ్డి ఎడిటర్లుగా పనిచేశారు. కిట్లు విస్సాప్రగడ, రాహుల్ రవీంద్రలు పంచ్ డైలాగులు రాశారు. RX 100 చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందించారు. టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్‌తో మన్మథుడు 2 చిత్రానికి పాజిటివ్ బజ్ ఏర్పడగా.. తెలుగుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా నేడు భారీగా విడుదలైంది ఈ చిత్రం. యూఎస్ఏలో 250 పైగా లొకేషన్లలో ఇప్పటికే ఈ చిత్రం ప్రదర్శితం కావడంతో ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు నెటిజన్లు.

Tags

Read MoreRead Less
Next Story