పోస్టాఫీస్‌లో రూ.20లతో సేవింగ్స్ అకౌంట్..

పోస్టాఫీసుల్లో డబ్బు డిపాజిట్ చేస్తే భద్రతతో పాటు బోలెడు ప్రయోజనాలు కూడా. ఇక్కడ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చెయ్యాలంటే కేవలం రూ.20లు ఉంటే సరిపోతుంది. పొదుపు ఖాతా తెరిచి ఏడాదికి 4 శాతం వడ్డీ పొందొచ్చు. ఇందులో ఉండే ప్రయోజనాలు ఒకసారి చూస్తే..
నగదు రూపంలో డబ్బులిచ్చి అకౌంట్‌ను ప్రారంభించొచ్చు. చెక్‌బుక్ ఫెసిలిటీ లేని అకౌంట్‌దారులు ఖాతాలో కనీసం రూ.50లు మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి. అదే చెక్‌బుక్ ఉంటే మినిమమ్ బ్యాలెన్స్ రూ.500లు ఉండాలి. వడ్డీపై పన్ను మినహాయింపు ఉంది. ఏడాదిలో రూ.10,000 వరకు ఎలాంటి ట్యాక్స్ ఉండదు. నామినేషన్ సౌకర్యం ఉంది. ప్రారంభించేటప్పుడైనా లేదా తర్వాత అయినా నామినీని చేర్చుకోవచ్చు. అకౌంట్‌ను ఒక పోస్టాఫీస్ నుంచి మరొక పోస్టాఫీస్‌కు మార్చుకోవచ్చు. పిల్లల పేరుపై కూడా అకౌంట్ తెరవొచ్చు. అలాగే జాయింట్ అకౌంట్ సౌకర్యం కూడా ఉంది. అకౌంట్ యాక్టివ్‌గా ఉండాలంటే మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఒక్కసారైనా అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ చేయడమో లేదా విత్ డ్రా చేయడమో చేయాలి. ఏటీఎం ఫెసిలిటీ అందుబాటులో ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com