ఈనెల 19 తర్వాత బీజేపీలోకి వలసలు : కన్నా లక్ష్మీనారాయణ

X
వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆత్రం తప్ప ప్రగతి కనిపించడంలేదని విమర్శించారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ. ఈనెల 19 తర్వాత అన్ని రాజకీయ పార్టీల నుంచి బీజేపీలోకి వలసలు ఉంటాయని తెలిపారు. శ్రీకాకుళంలో నిర్వహించిన ఆర్టికల్ 370 రద్దు విజయోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు వంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న ఘనత మోదీ సర్కార్కే దక్కుతుందన్నారు. ఎన్డీయేలోకి చంద్రబాబుకు డోర్లు క్లోజ్ అయ్యాయని తమ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారని పేర్కొన్నారు కన్నా.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
