తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. త్వరలో..

తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. త్వరలో..

దక్షిణాదిలో కర్నాటకను చేజిక్కించుకన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టింది.. రాబోయే ఎన్నికల నాటికి తెలంగాణలో అధికారం కైవసం చేసే దిశగా ఆపార్టీ అడుగులు వెస్తోంది. అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా ఆవిర్బవించిన టీఆర్ఎస్.. బీజేపీ ఎత్తులను నిశితంగా గమనిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలుపొందిన బీజేపీ మోదీ అమిత్ షా ద్వయం దిశ నిర్దేశంతో తెలంగాణలో పాగవేసేందుకు ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. ఇప్పటికే కీలక నేతలు కాంగ్రెస్ , టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఊవ్విళూరుతోంది. అయితే పార్లమెంట్ సమావేశాల్లో ఆర్టీఐ, ట్రిబుల్ తలాక్ , ఆర్టికల్ 370 , జమ్మూకశ్మీర్ విభజన లకు మద్దతు తెలిపిన టీఆర్ఎస్ .. తెలంగాణలో బీజేపీ ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు అభివృద్దే తమ ఎజెండా అంటోంది..

బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను గమనిస్తున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సమయం వచ్టినప్పుడుల్లా ఆ పార్టీ పై విరుచుకు పడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క సీటుగెలిచినా.. బీజేపీ విర్రవీగవడం ఖాయమమంటూ ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో వ్యాఖ్యానించారు. మరోవైపు జమ్మూకశ్మీర్ విభజన , ఆర్టీకల్ 370 రద్దుతో దేశవ్యాప్తంగా ఆపార్టీ తీసుకున్న నిర్ణయానికి మెజార్టీ మద్దతు వస్తోంది. దీంతో తొలిసారిగా కేసీఆర్ దేశంలో జరుగుతున్న పరిణామాలపై తెలంగాణ వికాస సమితి సమావేశంలో స్పందించారు.. దేశంలో కొన్ని ప్రత్యేక పరిస్ధితులు నెలకొన్నాయని.. మహాత్మగాందీని విమర్శించే వారిని సైతం దేశ భక్తులనడంపై కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మతం, రాజకీయం విడదీయలేనంత ప్రమాదకరంగా పెనవేసుకుపోతోందని పేర్కొన్నారు. అభివృద్ది నినాదం తెలంగాణ వాదం.. పరమత సహనం తెలంగాణ ప్రత్యేకత అన్నారు.

మరోవైపు మజ్లిస్ తో దోస్తి చేస్తూ లౌకికవాదంపై మాట్లాడటం హస్యాస్పదంగా ఉందని కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్ణణ్ . నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన పటేల్‌ను పక్కన పెట్టిన టీఆర్‌ఎస్‌ నేతలు దేశభక్తి గురించి మాట్లాడడం సరికాదన్నారు లక్ష్మణ్‌.. సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం నిర్వహించకుండా దేశభక్తి గురించి కేటీఆర్ మాట్లాడటం విడ్టూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

సొంతంగా బలపడటం కుదరకపోతే ఇతర పార్టీల నేతలను చేర్చుకోనైనా బలపడాలనే నిర్ణయానికి వచ్చింది బీజేపీ .. తెలంగాణలో పాగావేసేందుకు అమిత్ షాకు సభ్యత్వం ఇచ్చేందుకు ప్లాన్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోదీ, అమిత్ షా లను టార్గెట్ చేసిన కేసీఆర్‌ .. ఇప్పుడు బీజేపీ ప్రయత్నాలకు కౌంటర్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు .. తెలంగాణ వికాస సమితి మీటింగ్‌లో కేటీఆర్‌ వ్యాఖ్యలు అందుకు నిదర్శనం అంటున్నారు ఆ పార్టీ శ్రేణులు.

Tags

Read MoreRead Less
Next Story