కాళేశ్వరం పంప్‌ హౌస్‌లకు దేవతల పేర్లు పెట్టిన సీఎం కేసీఆర్

కాళేశ్వరం పంప్‌ హౌస్‌లకు దేవతల పేర్లు పెట్టిన సీఎం కేసీఆర్

పంచాయతీ రాజ్‌ వ్యవస్థ బలోపేతంపై దృష్టి పెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. గ్రామపంచాయతీ నుంచి జిల్లా పరిషత్‌ల వరకు ఎవరు ఏ విధులు నిర్వర్తించాలనే దానిపై పూర్తి స్పష్టత ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈమేరకు అధికారులు , నిపుణులతో విస్తృతంగా చర్చంచి ముసాయిదా రూపొందించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కేసీఆర్‌ ఆదేశించారు. జిల్లా, మండల పరిషత్‌లు ఇప్పటి మాదిరిగా ఏ పనీ లేకుండా ఉత్సవ విగ్రహాలుగా ఉండబోవని , అధికార వికేంద్రీకరణ ద్వారా వారికి విధులు, నిధులు , బాధ్యతలు, అధికారాలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. గ్రామాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభిస్తామని తెలిపారు. పంచాయతీరాజ్‌ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ మంత్రులు జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావులతో పాటు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

గ్రామాలు, పట్టణాలల్లో పచ్చదనం పెంచే కార్యక్రమాన్ని పర్యవేక్షించడం కోసం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి గ్రీన్‌ కమిటీని నియమిస్తున్నట్లు వెల్లడించారు సీఎం కేసీఆర్. పల్లెల రూపురేఖలు మార్చడం కోసం ప్రభుత్వం కొత్త పంచాయతీ రాజ్‌ చట్టం తెచ్చామని స్పష్టం చేశారు. ముసాయిదాపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి అసెంబ్లీలో చర్చపెడతామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత గ్రామాల్లో, పట్టణాల్లో 60 రోజుల కార్యాచరణ అమలు చేస్తామని చెప్పారు. పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లా పరిషత్‌ సీఈవో వరకు అన్ని ఖాళీలను భర్తీ చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

మరో వైపు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, పంప్‌ హౌస్‌లకు దేవతల పేర్లు ఖరారు చేసిన సీఎం కేసీఆర్.. కన్నెపల్లి పంప్‌హౌస్‌కు లక్ష్మీ పంప్‌హౌస్‌గా.. అన్నారం బ్యారేజీకి సరస్వతి , సుందీళ్ల బ్యారేజీకి పార్వతి బ్యారేజీగా నామకరణం చేశారు. నందిమేడారం రిజర్వాయర్, పంప్‌హౌస్‌కు నంది, లక్ష్మీపురం పంప్‌హౌస్‌కు గాయత్రిగా పేర్లు ఖరారు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story