సోనాక్షి దెబ్బతో కిందపడ్డ అక్షయ్‌

సోనాక్షి దెబ్బతో కిందపడ్డ అక్షయ్‌
X

ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే నిగర్వి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్‌. ఇతురుల పట్ల ఆయన ప్రవర్తించే తీరు బాలీవుడ్‌లో అక్షయ్‌ని ఓ ఐకాన్‌గా నిలబెట్టింది. ఎంత మర్యాదస్తుడో అంతే ఫన్నీ కూడా. తనదైన శైలిలో తోటి నటులను ఆటపట్టిస్తూ తనలో కమేడియన్‌ ని కూడా అప్పుడప్పుడు బయటపెడుతూ ఉంటారు. ప్రస్తుతం అక్షయ్ ‘మిషన్‌ మంగళ్‌’ చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా ఆ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఓ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ప్రోగాంలో ప్రముఖ హీరోయిన్లు నిత్యామీనన్‌, తాప్సి, విద్యాబాలన్‌, కీర్తి కుల్హరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన అనుభవాలను వారితో పంచుకున్నారు అక్షయ్‌ .

ఈ క్రమంలో అక్షయ్ మాట్లాడుతూ . ఒక్కసారిగా కుర్చిలో నుంచి వెనక్కి వాలాడు. పక్కనే కూర్చున్న సోనాక్షి తన చేయితో అక్షయ్‌ని వెనక్కి నెట్టింది. దీంతో అక్షయ్‌ వెనక్కి పడిపోయాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. సోనాక్షి మాత్రం పెద్దగా నవ్వతూ ‘‘నాకు ఎవరైనా చిరాకు తెప్పిస్తే నేను ఇలాగే ప్రవర్తిస్తాను’’అంటూ తనకు తానుగా సమర్ధించుకుంది. కింద పడిపోయిన అక్షయ్ తేరుకుని పైకి లేచి సోనాక్షి వైపు చేయి చూపుతూ ఏంటంటూ? ఎక్స్‌ప్రెషన్‌ పెట్టారు. తర్వాత ఇంటర్వూను కొనసాగించారు. . దీనికి సంబంధించిన వీడియోను సోనాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.

Tags

Next Story