రైనా.. త్వరగా కోలుకోవాలంటూ..

గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న సీనియర్ ఆటగాడు సురేష్ రైనాకు సర్జరీ జరిగింది. నెదర్లాండ్స్‌లోని అమస్టర్‌డామ్‌లో శస్త్ర చికిత్స జరిగినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. మోకాలి నొప్పిని భరిస్తూనే దేశవాళీ మ్యాచ్‌లు ఆడుతున్న రైనా ఎట్టకేలకు చికిత్స చేయించుకున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ తన ట్వీటర్ ఖాతా ద్యారా వెల్లడించింది. "నాలుగు నుంచి ఆరు వారాలపాటు రైనా క్రికెట్‌కు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు, రైనా త్వరగా కోరుకోవాలని ఆకాంక్షిస్తున్నాం" అని తెలిపింది.
పేలవ ఫామ్ కారణంగా సురేశ్ రైనా.. జట్టులో చోటు కోల్పోయాడు. ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో మాత్రం రెగ్యులర్‌గా మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఇప్పటివరకు సురేష్ రైనా 226 వన్డేలు ఆడి 5,615 పరుగులు చేయగా, 78 అంతర్జాతీయ టీ20ల్లో 1,605 పరుగులు చేశాడు. అలాగే 18 టెస్టు మ్యాచ్‌లు ఆడి 768 పరుగులు సాధించాడు. భారత్ తరఫున గత ఏడాది జూలైలో చివరిగా వన్డే ఆడిన సురేశ్ రైనా మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్నాడు.
Mr Suresh Raina underwent a knee surgery where he had been facing discomfort for the last few months. The surgery has been successful and it will require him 4-6 week of rehab for recovery.
We wish him a speedy recovery ???? pic.twitter.com/osOHnFLqpB
— BCCI (@BCCI) August 9, 2019
;
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com