భార్యను చంపి ఆమె తలతో పోలీసులకు లొంగిపోయిన భర్త

భార్యను చంపి ఆమె తలతో పోలీసులకు లొంగిపోయిన భర్త

కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేశాడో కసాయి. భార్యను హత్య చేసిన తర్వాత తలను తీసుకొని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. విజయవాడ సత్యనారాయణపురంలో ఈ దారుణం చోటు చేసుకుంది. భార్యతో విబేధాలు తలెత్తటంతో ప్రదీప్ బరితెగించిపోయాడు. నడివీధిలో పీక కోసి నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు హంతకుడు.

ప్రదీప్, మనీక్రాంతి ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే..రెండేళ్లుగా ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. వివాదాలు ముదరటంతో విడాకుల వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలోనే భర్త ప్రదీప్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది మనీక్రాంతి. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న ప్రదీప్...బెయిల్ పై బయటికి రాగానే భర్యాను అతికిరాతకంగా హత్య చేశాడు.

Tags

Read MoreRead Less
Next Story