కోళ్ల ఫారంలోకి ప్రవేశించిన కొండ చిలువ.. కోడిని మింగి చివరకు..

కోళ్ల ఫారంలోకి ప్రవేశించిన కొండ చిలువ.. కోడిని మింగి చివరకు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్‌లో కొండ చిలువ కలకలం రేపింది. ఓ కోళ్ల ఫారంలోకి ప్రవేశించిన కొండ చిలువ.. ఓ కోడిని మింగేసింది. నాలుగు కోళ్లను చంపేసింది. గమనించిన యజమాని... ప్రాణాధార స్నేక్‌ ప్రొటెక్షన్‌ ట్రస్టుకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్‌ ప్రొటెక్షన్‌ ట్రస్టు సభ్యులు... 9 అడుగుల పొడవు, 30 కేజీల బరువు ఉన్న కొండ చిలువను చాకచక్యంగా పట్టుకున్నారు. ఫారెస్ట్ అధికారుల సాయంతో అడవిలో వదలనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story