ఉసురు తీస్తున్న విద్యుత్‌ తీగలు

ఉసురు తీస్తున్న విద్యుత్‌ తీగలు

ఉమ్మడి మెదక్ జిల్లా, కామారెడ్డి జిల్లాల్లో విద్యుత్ తీగలు ఐదుగుర్ని బలి తీసుకున్నాయి. ఇందులో ఇద్దరు విద్యార్ధులు. తల్లిదండ్రులకు వ్యవసాయంలో సాయం చేసేందుకు వెళ్లి మృతి చెందారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ లో ఆకుల ప్రేమ్ సాయి తండ్రికి సాయంగా పొలం పనులకు వెళ్లాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న అతను కల్టివేటర్ ట్రాక్టర్ కోసం బిర్రు వైరు తీసుకెళ్తుండగా విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అటు ఆందోల్ మండలంలో తలెల్మాలో కరెంట్ షాక్ కొట్టి 8వ తరగతి విద్యార్ధి నితిన్ మృతి చెందాడు. మరోవైపు సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మాజిపేటలో వరిగడ్డి కోస్తున్న బూరు ఎర్రోళ్ల నాగయ్య మృతి చెందారు. కామారెడ్డి జిల్లాలో పొలం పనులకు వెళ్లిన తల్లి, కొడుకు కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు. తాడ్వాయిమండలం కృష్ణాజివాడికి చెందిన అనసవ్వ, నరేష్ పొలం నుంచి తిరిగొస్తుండగా..అడవిపందుల కోసం అమర్చిన విద్యుత్ వైర్లు తగిలి అక్కడిక్కడే మృతి చెందారు.

Tags

Read MoreRead Less
Next Story