యూట్యూబ్‌లో పెట్టకూడని వీడియో పెట్టాడు.. చివరకు..

యూట్యూబ్‌లో పెట్టకూడని వీడియో పెట్టాడు.. చివరకు..

సాహసోపేతమైన వీడియోలు తీసి యూ ట్యూబ్‌లో పెట్టే ఓ యువకుడి సరదా కటకటాలపాలు చేసింది. ఈ ఘటన తిరుపతిలో జరిగింది. ఏర్పేడు మండలం పాయల్‌ సెంటర్‌కు చెందిన రామిరెడ్డికి యూట్యూబ్‌లో అడ్వెంచర్‌ వీడియోలు అప్‌లోడ్‌ చేసి డబ్బు సంపాదిద్దామనుకుడున్నాడు. అందులో భాగంగా పట్టాలపై బైక్‌లు, బాణసంచా, బొమ్మలు లాంటివి పెట్టి.. రైలు వాటిపైనుంచి వెళ్లేప్పుడు వీడియోలు షూట్ చేసి వాటిని అప్‌లోడ్‌ చేసేవాడు. ఈ సారి ఏకంగా గ్యాస్‌ సిలిండర్‌ను పట్టాలపై పెట్టాడు. దాన్ని రైలు ఇంజిన్‌ ఢీకొట్టడంతో సిలిండర్‌ ఎగిరి అవతలపడింది.

ప్రమాదకరంగా ఉన్న ఈ వీడియోను హైదరాబాద్‌కు చెందిన నరసింహ చూసి ట్విట్టర్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రైలు పట్టాలపై గ్యాస్‌ సిలిండర్‌ పెట్టి వీడియో తీసిన రామిరెడ్డిని రేణిగుంట పోలీసులు అరెస్టు చేశారు. అతని యూట్యూబ్ ఛానెల్‌లో ఇలాంటివి 40కిపైగా వీడియోలు ఉన్నట్టు గుర్తించి వెంటనే దాన్ని బ్లాక్ చేశారు. యూట్యూబ్‌ వ్యూస్‌కి వచ్చే డబ్బుల కోసం ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తూ జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నందుకు రామిరెడ్డిపై కేసు నమోదుచేశారు.

Tags

Read MoreRead Less
Next Story